మొబైల్స్ తయారీదారు హువావే తన నూతన స్మార్ట్‌బ్యాండ్.. బ్యాండ్ 4 ప్రొను తాజాగా విడుదల చేసింది. ఇందులో 0.95 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లే, ఎన్‌ఎఫ్‌సీ, 11 రకాల ఎక్సర్‌సైజెస్ ట్రాకర్, జీపీఎస్, హార్ట్ రేట్ సెన్సార్, ఎస్‌పీవో2 సెన్సార్ తదితర ఫీచర్లను ఏర్పాటు చేశారు. ఈ బ్యాండ్‌ను రూ.4వేలకు వినియోగదారులు డిసెంబర్ 12వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు.
బ్యాండ్ 4 ప్రొ స్మార్ట్ బ్యాండ్‌ను విడుదల చేసిన హువావే